పేమెంట్ సర్వీస్‌లోకి అడుగుపెట్టనున్న ‘వాట్సాప్’

శనివారం, 20 జులై 2019 (12:16 IST)
గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎమ్, అమెజాన్‌లాగే ఆన్ లైన్ పేమెంట్ సర్వీస్ లోకి ‘వాట్సాప్’ కూడా అడుగుపెట్టబోతోంది. వాట్సాప్ మాతృసంస్థ ‘ఫేస్ బుక్’ దీనికి సంబంధించిన అనుమతుల కోసం ప్రయత్నిస్తోంది.


నిజానికి గతంలోనే ‘వాట్సాప్ పేమెంట్’ సేవలు ప్రారంభం కావాల్సి ఉన్నా, డేటా సెక్యూరిటీ కారణాలతో వాయిదా పడింది. 
 
అయితే యూజర్ల డేటాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వానికి కంపెనీ వివరించింది. దీంతో ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు అనుమతి కోసం ప్రయత్నిస్తోంది. ఆర్బీఐ అనుమతులు రాగానే ‘వాట్సాప్ పేమెంట్’ సేవలు ప్రారంభమవుతాయి.

వాట్సాప్ యూజర్లు భారీ సంఖ్యలో ఉన్నందున తాము విజయం సాధిస్తామని సంస్థ నమ్ముతోంది. దేశంలో వాట్సాప్ కు ముప్పై కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు