గత వారం ఓ యువతి కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణలో ఆ యువతి జూలియస్ అనే వ్యక్తి ఇంటికి వెళ్లినట్లు తేలింది. జూలియస్‌కు ఆ యువతి ఫేస్ బుక్ ఫ్రెండ్. జూలియస్ ఇంటికి పిలవడంతో అతని ఇంటికి వెళ్లింది. అలా ఇంటికొచ్చిన యువతిని లొంగదీసుకున్న జూలియస్.. ఆమెతో శారీరకంగా కలిశాడు.
ఆ యువతి కూడా అతనిని ఇష్టపడింది. ఆపై ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో జూలియస్ ఆ యువతిని హతమార్చి తన ఇంటికి సమీపంలో పూడ్చిపెట్టాడు. ఈ కేసులో సైకో కిల్లర్ అని తేలిన జూలియస్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. అతను నలుగురు ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌ను ఇంటికి రప్పించి.. వారితో ఉల్లాసంగా వుండి.. హతమార్చుతాడని ఒప్పుకున్నాడు. అతని ఇంటి పరిసరాల్లో ఆ నలుగురు యువతుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టంకు పంపారు.