పీసీ, ట్యాబ్ ధరలు పెరుగుతాయా? కారణం ఏంటంటే?

గురువారం, 20 జనవరి 2022 (14:14 IST)
కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతి పెరగడంతో పాటు పీసీలకు, ట్యాబ్‌లకు డిమాండ్ పెరుగుతున్న కారణంగా ల్యాప్ టాప్, పీసీల ధరలు త్వరలో పెరగనున్నాయి. వినియోగం పెరిగిన కారణంగా తయారీ వ్యయాలు కాస్త అధికం కావంతో కొనుగోలుదారులపై భారం పడనుంది.  
 
ఈ ఏడాది పీసీలు, ల్యాప్ టాప్ ధరలు పెరగడానికి బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. యోగించే చిప్స్ సెమీ కండెక్టర్ తయారీ వ్యయాలు పెరిగాయని ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థ అయిన తైవాన్ సెమీ కండక్టర్ కంపెనీ (టీఎస్ఎంసీ) అంటోంది. హార్డ్ వేర్ వస్తువుల ధరలు కాస్త పెరగడంతో పీసీ, ట్యాబ్‌ల ధరలు పెరుగనున్నాయి.

వెబ్దునియా పై చదవండి