చైనాకు చెందిన మొబైల్ మేకర్ షియోమీ రెడ్‌మీ నోట్ 4 మొబైల్‌ను ఆదివారం ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనుంది. బుధ, శుక్రవారాల్లో ఈ స్మార్ట్‌ఫోన్ ఈ-కామర్స్ సైట్‌లో అందుబాటులో ఉన్నప్పటికీ.. ఈ వారంలో ఒక ఆఫ్‌లైన్ ఉండనున్నట్లు ఇటీవల ఫ్లిఫ్‌కార్ట్ ప్రకటించింది.
ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ నోట్4 మొబైళ్లు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999 కాగా, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.12,999. గోల్డ్, గ్రే, మ్యాట్ బ్లాక్ రంగుల్లో.. మెటల్ బాడీతో ఇవి అందుబాటులో ఉన్నాయని రెడ్ మీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
రెడ్ మీ నోట్ 4 ఫీచర్స్ ఇవే..
ఐదు ఇంచ్‌ల హెచ్డీ కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే
స్నాప్‌డ్రాగన్ 435 ఎస్ఓసీ,
ఎమ్ఐయూఐ 8 బేస్డ్ ఆండ్రాయిడ్ 6.0.1
13-మెగాపిక్సల్ రియర్ కెమెరా
5-మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా