ఐటీ పదప్రయోగాలను నిర్వచించే సైట్

గురువారం, 3 ఏప్రియల్ 2008 (13:58 IST)
ప్రత్యేకించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి వాడుకలో ఉన్న పదాలకు, సాంకేతిక నామాలకు సమగ్రమైన నిర్వచనాన్ని వాటీజ్‌టార్గెట్ వెబ్‌సైట్ అందిస్తున్నది. క్లిష్టమైన పదాలకు సరళమైన రీతిలో విడమరిచి చెప్పడంలో ఈ సైట్ ఔత్సాహికులకు ఎంతగానో ఉపకరిస్తున్నది.

ఎ నుంచి జెడ్ వరకు అక్షర క్రమంలో అవసరమైన పదానికి ఆరంభమైన అక్షరాన్ని ఎన్నుకుని మనకు కావలసిన పదానికి చెందిన సమాచారాన్ని ఇక్కడ పొందవచ్చు. అలాగే ఐటీరంగంలోకి కొత్తగా వచ్చే పదాన్ని రోజుకొకటి చెప్పున నెటిజన్లకు పరిచయం చేయడం ద్వారా తన సందర్శకులను అప్‌డేట్ చేయడంలో ఈ సైట్ తనదైన ప్రత్యేకతను ప్రదర్శిస్తున్నది.

సైట్‌ను సందర్శించే నిమిత్తం వాటీజ్ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.

వెబ్దునియా పై చదవండి