సాంకేతిక రంగంపై వత్తిడి పెంచుతన్న ఆర్థికమాంద్యం

శనివారం, 4 అక్టోబరు 2008 (12:52 IST)
ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం సమాచార సాంకేతిక రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. చాలా సంస్థలు తమ ఉద్యోగులలో కోత పెడుతున్నాయి. కంప్యూటర్, ఎలక్ట్రానిక్ తయారీ సంస్థలు తమ పనిని పెంచుకోవడం లేదు. తాజా లెక్కల ప్రకారం ఐటీ సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాలకు చెందిన సంస్థలు ఆగస్టులో ఒక అమెరికాలో 5100 ఉద్యోగాలను సృష్టించాయి. అంటే 5 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. కాని సెప్టెంబర్ లెక్కలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఒక్క టెలి కమ్యూనికేషన్ కంపెనీలే 3,400 ఉద్యోగాలను తొలగించారు.

తమ పేరోల్స్‌ను సెప్టెంబర్ నెలలో భారీగా తగ్గించేశాయి. వీరిలో చాలా మంది ఐదేళ్ళకుపైగా పని చేస్తున్నావారే కావడం విశేషం. ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఆభద్రతకు లోనవుతున్నారు. ఇదిలా ఉండగా ఆర్థిక అండదండలిచ్చే సంస్థలు చతికిలబడడంతో కంపెనీ పని భారంతోపాటు, ఉద్యోగులను కూడా వదిలించుకుంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి