3జి సెల్‌ఫోన్‌ అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది!

File
FILE
టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణల పుణ్యమాని మొబైల్‌ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మొదటిలో సెల్‌ఫోన్‌‌లో కెమెరా ఉండేది కాదు. ఇప్పుడు అన్ని సెల్‌ఫోన్‌లలో కెమెరాతో ఎఫ్‌.ఎం. రేడియో, ఇంటర్నెట్‌ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఒక తరం నుంచి అభివృద్ధి చెంది కొత్త ఫ్యూచర్లతో ఉన్నతమైన రకంగా వచ్చే మార్పునే సెల్‌ఫోన్‌ జనరేషన్‌గా పిలుస్తారు. వీటినే.. 1జి, 2జి, 3జి, 4జి లుగా పరిగణిస్తారు.

3జి సెల్‌ఫోన్‌లలో వీడియో కెమెరా ఉన్నందున వీడియోలు చూడడానికి, పంపించేందుకు వీలు ఉంటుంది. కెమెరా కన్ను వెనుభాగంలో కాకుండా ముందు భాగంలో వుంటే... అది మీ రూపాన్నే గ్రహించి, మాటల ధ్వని తరంగాలతో పాటు, మన రూపాన్ని కూడా విద్యుత్‌ సంకేతాలుగా మార్చి ప్రసారం చేసి అదే సదుపాయం ఉన్న అవతలి ఫోన్‌లో మాటలతో మాట్లాడే మన వీడియో కనిపిస్తుంది.

ముఖ్యమంత్రులు జిల్లాలలో ఉండే కలెక్టర్లతో మాట్లాడే వీడియో కాన్ఫెరెన్స్‌ల గురించి వినే ఉంటారు. ఈ విధానం ఇప్పటికే ఇంటర్నెట్‌, ఇ-గవర్నెన్స్‌లోనూ అమల్లో ఉంది. కంప్యూటర్‌ మానిటర్‌‌పై ఉండే కెమెరా (దీన్నే వెబ్‌ కెమెరా అంటారు) మన బొమ్మలను, మైక్రోఫోన్‌ మన మాటల్ని ఇంటర్నెట్‌ ద్వారా అవతలివారికి చేరవేస్తుండటం వల్లనే ఎక్కడో అమెరికాలో ఉన్న మన వాళ్ళని చుస్తూ మాట్లాడుకో గలుగుతున్నాం. ఇది ఇప్పుడు సెల్‌ఫోన్‌లకు వచ్చేసింది.

వెబ్దునియా పై చదవండి