వినియోగదారులకు అవసరమైన ఆధునిక మొబైల్ ఫోన్లను ఫిన్లాండ్‌కు చెందిన నోకియా విడుదల చేసింది. వీటి పేర్లు నోకియా E71, E66. ప్రపంచ మొబైల్ ఫోన్ల విక్రయాల్లో నోకియా అగ్రస్థానంలో కొనసాగుతుంది. నోకియా E71 ధర రూ. 22,949లు కాగా, E66 ధర రూ.23,689లు. మొబైల్ ఫోన్లను స్టైల్‌గా వాడేవారు కొత్త ఫోన్లను కొనుగోలు చేస్తారని నోకియా అంటోంది.
నోకియా కొత్త మొబైల్ ఫోన్లలో వ్యక్తిగత పనులను వేగంగా చేసుకుంటూనే ఇమెయిల్స్‌ను పంపుకోవచ్చునని నోకియా ఇండియా మార్కెటింగ్ డైరెక్టర్ దేవీందర్ కిషోర్ చెప్పారు. ఆధునిక మల్టీమీడియా సదుపాయాలు ఈ రెండు మొబైల్ ఫోన్లలో ఉన్నాయని వివరించారు.
తేలికగా ఇమెయిల్ నోకియా ఆధునిక మొబైల్ ఫోన్లలో వృత్తిపరమైన, వ్యక్తిగత ఇమెయిల్స్‌ను తేలికగా పంపుకోవచ్చు. వినియోగదారులు తమ కార్యాలయాల్లో ఉపయోగించే మైక్రోసాఫ్ట్ ఎక్స్ఛేంజ్ లాగానే కొత్త మొబైల్ ఫోన్లలో ఇమెయిల్స్ వ్యవస్థ పనిచేస్తుంది. వినియోగదారులు రూపొందించిన ఇమెయిల్ సకాలంలో అవతలి వారికి చేరుకుంటుంది.
మొబైల్ ఫోన్లో డౌన్‌లోడ్ అటాచ్‌మెంట్స్ అయిన వర్డ్, ఎక్సెల్, పవర్‌ప్రింట్, పీడీఎఫ్ ఫైల్స్ వంటి వాటిని కూడా పొందుపరిచారు. నోకియా E71 మొబైల్ ఫోన్ ద్వారా డాక్యుమెంట్లను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంది. నోకియా కొత్త మొబైల్ ఫోన్లలో ఇమెయిల్ ఎకౌంట్ సేవలను ప్రపంచవ్యాప్తంగా దాదాపు వేయి మంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎస్‌పీలు) అందిస్తున్నారు.
ఇమెయిల్ సేవలను ముఖ్యంగా జీమెయిల్, యాహూ మెయిల్, హాట్‌మెయిల్ వంటివి నోకియాకు సహకరిస్తున్నాయి. నోకియా ఈ మెయిల్ సొల్యూషన్స్ కోసం సెవన్, విస్టోల సహకారం పొందుతుంది. నోకియా E66 ప్రీమియం రకం అందాలను కలిగిఉంది. స్టెయిన్‌లెస్ స్టీల్ యాసెంట్స్, స్మూత్ స్లైడింగ్ డిజైన్ వంటివి ఇందులో కల్పించారు. నోకియా E71లోని ముఖ్యమైన లక్షణాలను E66లో ఉన్నాయి.
నోకియా కొత్త మొబైల్ ఫోన్లలో సపోర్ట్ మ్యాప్స్, మ్యూజిక్, మీడియా షేరింగ్, వైర్‌లెస్ లాన్, త్రీజీ కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ రెండు మొబైల్ పోన్లలో ఒక్కోదానిలో 8జీబీ మేర సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవచ్చు. అలాగే 3.2 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమేరా, అసిస్టెడ్ జీపీఎస్, నావిగేషన్ కోసం నోకియా మ్యాప్స్ ఇందులో ఉన్నాయి.