బుల్లితెరకు బై చెప్పండి... వైర్లెస్ నెట్వర్క్ ద్వారా లెడ్ టీవీకి వెల్కమ్ చెప్పండి!!
మంగళవారం, 10 జులై 2012 (19:27 IST)
మన జీవితంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉపయోగం రోజు రోజుకి పెరిగిపోతోంది. మనలో చాలామంది స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ కంప్యూటర్స్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రతిరోజూ వాడుతూనే ఉన్నాం. ఇదే తరహాలో పలు ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా ఎన్నో రకాల గేమ్స్ ఆడుతున్నాం. ఫోటోలు తీస్తున్నాం. వీడియోలను ఇతరులతో షేర్ చేసుకుంటున్నాం. సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాం. ఇవన్నీ మన జీవితంలో ఒక భాగమైపోయాయంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.
అయినప్పటికీ మొబైల్స్, టాబ్లెట్, కంప్యూటర్స్ వంటి స్మాల్ స్క్రీన్లతోనే ఫోటోలు, వీడియోలను ఇతరులతో షేర్ చేసుకోవడం తప్పట్లేదు. ఇక స్మాల్ స్క్రీన్‌తోనే సరిపెట్టుకోవాలనే బాధ మీకు అక్కర్లేదు. ప్రస్తుతం LED TV ద్వారా మీకు ఇష్టమైన వారికి వీడియోలు, ఫోటోలను షేర్ చేసుకోవచ్చు. మీ మొబైల్స్, టాబ్లెట్, కంప్యూటర్ వంటి ఎలక్ట్రానిక్ సాధనాల ద్వారా దాచి వుంచిన ఎన్నో అంశాలను ఈ లెడ్ టీవీ బిగ్ స్క్రీన్ ద్వారా షేర్ చేసుకోవడం సులభమైంది.
DLNA సర్టిఫికేట్ పొందిన స్మార్ట్ ఎలక్ట్రానిక్ సాధనాలు ప్రస్తుతం మీ మల్టీమీడియా వివరాలను ఇతరులతో సులభంగా షేర్ చేసుకునేలా చేస్తోంది. మీ మల్టీమీడియా సమాచారాన్ని వైర్ లేదా వైర్లెస్ నెట్‌వర్క్‌ల ద్వారా ఇతరులతో షేర్ చేసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీ వద్ద SMART LED TV ఉంటే చాలు. ఈ టీవీ డీఎల్ఎన్ఏ సర్టిఫికేట్ పొంది వుంటుంది. దీంతో వై-ఫై నెట్వర్క్ ద్వారా మీ మల్టీమీడియా సమాచారాన్ని ఇతరులతో షేర్ చేసుకోవడం సులువు చేస్తుంది.
బెస్ట్ హోమ్ నెట్‌వర్క్‌ను డెవలప్ చేయాలంటే మీకు కావాల్సింది వైర్లెస్ రూటర్ మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ మాత్రమే. తద్వారా మీ స్మార్ట్ ఎలక్ట్రానిక్ సాధనాలన్నింటినీ దీనితో కనెక్ట్ చేయడం మరింత సులభం. అంటే మీ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లు, డిజిటల్ కెమెరాలు, గేమింగ్ కన్సోల్స్, వైర్లెస్ బ్లూ రే ప్లేయర్ వంటి ఇతర వైర్లెస్ నెట్‌వర్క్‌ల్ని కనెక్ట్ చేసుకోవచ్చు.
ఒక్కో ఎలక్ట్రానిక్ పరికరంలోని మెనూ, సెట్టింగ్‌లు కనెక్టివిటీకి కీలకంగా ఉపయోగపడతాయి. ఒకసారి డీఎల్ఎన్ఎ సర్టిఫికేట్ ఇచ్చిన స్మార్ట్ ఉపకరణాల్లో డీఎల్ఎన్ఎ అప్లికేషన్‌ను మీరు చూడొచ్చు. దీనిని మీరు క్లిక్ చేస్తేనే సరిపోతుంది. ఇలా క్లిక్ చేయడం ద్వారా మీ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసిన ఇతర డీఎల్ఎన్ఏ సర్టిఫికేట్ స్మార్ట్ ఉపకరణాలను మీరు గుర్తించవచ్చు. ఆ తర్వాత నెట్వర్కులలో మీరు షేర్ చేయదలచుకున్న వాటిని ఎంపిక చేసేందుకు మెను మీకు సహకరిస్తుంది. ఇందుకోసం మీరు... మీ మల్టీమీడియా ఫోల్డర్‌ను ఎంపిక చేస్తేనే సరిపోతుంది.
మీ డిజిటల్ కెమెరాలోని చిన్నపాటి ఫోటోలను మీ కుటుంబ సభ్యులతో కలిసి పంచుకోవాలని భావిస్తున్నట్టయితే.. అలాంటి ఫోటోలను ఎంచుకుని హై డెఫినెషన్‌లో మీరు వీక్షించవచ్చు. మీరు కోరకుంటే.. మల్టీ మీడియా గేమింగ్‌లలో కూడా సృష్టించవచ్చు. మీ ఎక్స్‌బాక్స్ 360 లేదా సోనీ ప్లేస్టేషన్ మీదుగా అతిపెద్ద ఆన్లైన్ ఆటను మీరు ఎంచుకున్నట్టయితే, మీ అనుచరులను ఆహ్వానించి వారితో గేమ్ ఆడుతూ మీ సత్తాను చాటుకోవచ్చు.
మీ మల్టీమీడియా అనుభవాన్ని ఇంకా వృద్ధి చేసేందుకు మీ మీడియా ఫైళ్ళంన్నింటినీ సెంట్రల్ నెట్వర్క్ స్టోరోజ్ పరికాల్లో క్రమబద్ధీకరించుకోవచ్చు. నెట్వర్క్ స్టోరేజ్ పరికరాలు అనేవి మీ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసిన హార్డ్ డ్రైవర్. ఒకసారి మీ విభిన్న స్మార్ట్ పరికరాలను నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసి, ఫైళ్లు క్రమబద్ధీకరిస్తే... మీరు అనుకున్న సమయంలో, కోరుకున్నట్టుగా మల్టీ మీడియా మాయాజాలాన్ని మీరు మీకు ఇష్టమైన రీతిలో ఎంజాయ్ చేయవచ్చు.
స్మార్ట్ లెడ్ టీవీలలో ప్లే ఇన్స్టాల్ అప్లికేషన్లు ఉంటాయి. వాతావరణం, గేమ్స్, ఎప్పటికపుడు వార్తల అలెర్ట్స్, షాపింగ్, ఫోటో షేరింగ్ వంటి అనేక ప్లే ఇన్స్టాల్స్ ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే... స్మార్ట్ హోమ్ నెట్‌వర్క్‌ను అమర్చుకుని స్మార్ట్ సాధనాలు మరియు లెడ్ టీవీలతో అనుసంధానం చేస్తే చాలు. ఆ తర్వాత స్మార్ట్ సాధనాలతో కూడిన మీ మల్టీ మీడియాలోని విషయాలను మీరు షేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో హెచ్డి టెక్నాలజీతో పెద్ద స్క్రీన్‌పై మీరు తిలకిస్తూ ఆనందించవచ్చు. అందువల్ల బుల్లితెరకు గుడ్‌బై చెప్పి.. పెద్ద స్క్రీన్‌లో ఇన్బాక్సును హై టెక్నాలజీ సౌకర్యాలతో చూసి తిలకించవచ్చు.
ఈ వెబ్‌సైట్‌ను సందర్శించి స్మార్ట్ లెడ్ టీవీలు, మరియు మీ హోం నెట్వర్క్ ఏర్పాటుకు సహకరించే వైర్లెస్ రూటర్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇంతేకాకుండా వివిధ ఎలక్ట్రానిక్ సాధనాలను గురించి తెలుసుకునేందుకు రిలయన్స్ డిజిటల్ ఓ ఉత్తమ ప్రదేశం.
రిలయన్స్ గృహ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గేమింగ్ మరియు టెలికాం ఉత్పత్తులు, కంప్యూటర్లే కాదు.. అన్నీ వస్తువులు ఒకేచోట అందుబాటులో ఉంటాయి. వీటిలో మీ ఉపయోగానికి కావాల్సిన వస్తువులను ఎంపిక చేసుకోవచ్చు. స్టోర్లలో పనిచేసే సహాయకుల సహకారంతో మీ నగదుకు తగిన సేవలను అందిస్తామని రిలయన్స్ డిజిటల్ హామీ ఇస్తుంది.
WD
www.reliancedigital.in వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా రిలయన్స్ గురించి అదనపు సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రిలయన్స్ గురించి మరింత సమాచారం కోసం ఫేస్బుక్లో తమ నిపుణులను సంప్రదించవచ్చు. ట్విట్టర్లో మీ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇంకా రిలయన్స్ ఉత్పత్తుల గురించి అదనంగా తెలుసుకోవాలంటే యూట్యూబ్‌లో కూడా వీక్షించవచ్చు.