సమగ్రమైన టెలికాం సమాచారాన్ని ఇంటర్నెట్‌పై అందించే ఏకైక వెబ్‌సైట్‌గా టెలికాం డైజెస్ట్ వెబ్‌సైట్ పేరొందింది. 1981 సంవత్సరం నుంచి పాట్రిక్ టౌన్‌సన్ మరియు ఇతర ప్రయోక్తలు ఈ వెబ్‌సైట్ నిర్వహణలో పాలు పంచుకుంటున్నారు.
ఇప్పటికీ అందుబాటులో ఉన్న పురాతనమైన మెయిలింగ్ లిస్ట్‌గా టెలికాం డైజెస్ట్‌ను చెప్పుకోవచ్చు. తొలి తరపు టెలిఫోను నుంచి ఎస్‌పీఏఎమ్ దాకా టెలికాం రంగం చవిచూసిన సాంకేతిక విప్లవ సమాచారాన్ని ఈ వెబ్‌సైట్‌లో పొందవచ్చు.
వార్తాబృందానికి చెందిన సభ్యులు ఎప్పటికప్పుడు టెలికాం డైజెస్ట్‌లో కథనాలను పోస్టు చేస్తుంటారు. మాసిస్ అనే ఈ వెబ్‌సైట్‌లో నిక్షిప్తమైన సమాచార భాండాగారం మరే ఇతర వెబ్‌సైట్ వద్ద లేదనడం అతిశయోక్తి అనిపించుకోదు. ఎటువంటి అవార్డులను పొందనప్పటికీ అసంఖ్యాకమైన నెటిజన్ల హిట్లను పొందడంలో టెలికాం డైజెస్ట్ అప్రతిహతంగా ముందుకు సాగుతోంది.