సరికొత్త పాప్ సింగర్‌ సాఫ్ట్‌వేర్...

బుధవారం, 16 జులై 2008 (15:52 IST)
రాయిని అహల్యగా మార్చిన రాముడు దేవుడైతే... అంతటి కలియుగ వైకుంఠ వాసుడైన రాముడ్నే కదిలించింది... కరిగించేది పాటే. అన్న సత్యం మనందరికీ తెలిసిందే. దీన్ని బట్టి పాట ఎంత ప్రాముఖ్యమైనదో... దానికున్న విలువలు చెప్పడానికి భాష చాలదేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మరి ఆ పాటను పాడటం నేర్చుకోవాలంటే.. మంచి మాస్టారుని వెతుక్కోవాలి.. క్రమం తప్పకుండా తరగతులకు హాజరుకావాలి. కాస్తంత కష్టపడితే పాట పాడటం వంటివి వస్తాయి.

అలాగే పాప్ సింగర్‌లా పాడాలంటే దానికి కూడా మరికొన్ని సంగీత పాఠాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ పాఠాలు ఏవీ నేర్చుకోవాల్సిన పనిలేదు అంటున్నారు కంప్యూటర్ జ్ఞానులు. అందుకోసం మీ కంప్యూటర్ స్విచ్‌ను మాత్రం అన్ చేస్తే పాప్ గాయకుల్లా పాడేయచ్చు అని తెగేసి చెబుతున్నారు.

ఇటీవలే కంప్యూటర్ నిపుణులు విస్తృత అధ్యయనం అనంతరం వైవిధ్యమైన అప్లికేషన్‌ను రూపొందించారు. బయోఫీడ్‌బ్యాక్ టెక్నాలజీ ఆధారంగా రూపొందిన ఈ అప్లికేషన్ ద్వారా గాయకులు తన స్వరాన్ని సాంకేతికంగా మెరుగుపరుచుకనేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

పాటలోని భావాలను వ్యక్తీకరించడంలో.. తాళానికి తగ్గట్టుగా అంటే లయబద్దంగా పాడే గాయకుల స్వరం తాలూకు శృతి కీలక పాత్ర వహిస్తుంది.. ఇది సంప్రదాయ సంగీత ఆలాపన తీరుకు అద్దం పడుతుంది. అయితే ఇప్పటివరకు స్వరంలోని నాణ్యతను గుర్తించేది మాత్రం పూర్తిగా సంబంధిత నిపుణులే అని.. అందులో ఏ మార్పు లేదని చెప్పవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.

టెల్ అవివ్ విశ్వవిద్యాలయం చేపట్టిన పరిశోధనల్లో కంప్యూటర్ ద్వారా స్వరనాణ్యతను గుర్తించేట్లుగా చేశారు. బయోఫీడ్‌బ్యాక్ టెక్నీలజీ ఆధారంగా రూపొందిన ఈ అప్లికేషన్.. పాడటంలో ఉన్న మెలకువలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు అవివ్ విశ్వవిద్యాలయంలోని ఓ సీనియర్ అధ్యపకులు నోవామ్ అమీర్ వెల్లడించారు.

ఈ అప్లికేషన్... సంగీత ప్రపంచంలో సరికొత్త ఒరవడిని, మ్యూజిక్ సెన్సేషన్‌ను సృష్టించేందుకు ఉపయోగపడకపోవచ్చుకాని.. పాప్ గాయకుల స్వరాలను ఎలా అనుకరించాలి...? అన్న దాన్ని నేర్పుతుందని అమీర్ స్పష్టం చేశారు. అలాగే వినసొంపైన స్వరాలాపన.. స్వరనాణ్యతలను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.

మన మాట్లాడే మాటలు మనలోని భావావేశాలపై ఆధారపడి ఉంటాయి. అలాగే ఆ పాటలోని భావావేశాలే గాయకుల స్వరంపై పడుతుంది. తద్వారా పాటలోని అందం మనకు కనపడుతుంది. ఈ అప్లికేషన్ కేవలం గాయకులపై చూపించే ఒక ప్రభావం మాత్రమేనని అమీర్ వ్యాఖ్యానించారు.

ప్రాథమిక స్థాయిలోని గాయకులు సంప్రదాయ సంగీత స్వరాలను పాడేప్పుడు కొంతవరకు స్వర నియంత్రణ పట్ల పట్టు కోల్పోతుండటం మేము గమనించామని.. అంతేకాకుండా ఎక్కడ తప్పు జరుగుతోందో తెలియక కాస్త ఆందోళనకు గురవ్వడం కూడా గమనించినట్లు వివరించారు. ఈ అప్లికేషన్‌లో వివిధ రకాల పాప్ గాయకుల స్వరాలను అనుకరించడం ద్వారా ఆ అంశాలను అధిగమించగలరని ఆశిస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి