సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లకే ఎక్కువ ప్రాధాన్యం

మన భారతీయులు ఇంటర్నెట్‌లో స్టాక్‌మార్కెట్ల కంటే సోషల్ నెట్‌వర్క్‌ల మీదే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఓ సర్వే వెల్లడించింది. దేశంలో దాదాపు 3.1 కోట్ల మంది యూజర్లు ఫేస్‌బుక్, ఆర్కుట్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో అకౌంట్లను కలిగి ఉండగా డిమ్యాట్ అకౌంట్‌ హోల్డర్స్ మాత్రం కేవలం 1.7 కోట్ల మంది మాత్రమే ఉన్నారు.

ఇంకో మాటలో చెప్పాలంటే సోషల్ నెట్‌వర్కింగ్ యూజర్లు, డిమ్యాట్ అకౌంట్ హోల్డర్ల కన్నా రెండింతలున్నారని చెప్పవచ్చు. స్టాక్ ఇన్వెస్టర్లకు డిమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. ఇది ఆశ్చర్యకర విషయమే, నిజానికి గత మూడేళ్ల నుంచే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు అధివృద్ధి చెందాయని ఎస్‌ఎమ్‌సీ క్యాపిటల్ అధిపతి జగన్నాధం అన్నారు.

దేశంలో ప్రజలు నెలకి 2 కోట్ల కొత్త మొబైల్ కనెక్షన్లు తీసుకుంటుండగా.. డిమ్యాట్ అకౌంట్లు మాత్రం కేవలం 2 లక్షలు మాత్రమే.. అంటే దాదాపు 100 రెట్లు తక్కువన్నమాట.

వెబ్దునియా పై చదవండి