అధునాతన టెక్నాలజీతో తయారైన ఐ-ఫోన్స్ ప్రస్తుతం మార్కెట్‌లో హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఈ ఫోన్స్‌ను యాపిల్ సంస్థ తయారు చేసి, తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్లు విడుదలైన మార్కెట్‌లలో ముఖ్యంగా న్యూయార్క్ నుంచి చైనా వరకు డిమాండ్ విపరీతంగా ఉంది. అన్ని దేశాల్లో మొబైల్స్ వినియోగదారులు ఈ కొత్త ఐ ఫోన్స్ కోసం గంటల తరబడి వేసి ఉండి కొనుగోలు చేస్తున్నారు.
ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో ఎన్నో రకాల ఫోన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. యాపిల్ సంస్థ విడుదల చేసిన ఈ ఐ-ఫోన్స్‌లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లలో బ్రౌజింగ్ చేసినట్టుగానే ఐ-ఫోన్స్‌లలో బ్రౌసింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 8 జిబి, 16 జిబి మెమరీలతో విడుదలైన ఐ-ఫోన్స్.. ప్రపంచ మొబైల్ మార్కెట్‌లో సరికొత్త విప్లవాన్నే సృష్టిస్తున్నాయి.