జగన్‌ కు సీమాంధ్రలో 140 సీట్లు... కేసీఆర్... మరి తెలంగాణలోనో...?

మంగళవారం, 24 సెప్టెంబరు 2013 (16:52 IST)
FILE
చంచల్ గూడ జైలు నుంచి బెయిలుపై విడుదలైన జగన్ మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 16 నెలలుగా జైలులో ఉన్న జగన్ జనంలోకి రాగానే అభిమానులు ఆయన కోసం ఎగబడ్డారు. ఇదిలావుంటే జగన్ స్టామినాపై కేసీఆర్ కూడా స్పందించారు.

జగన్ పార్టీకి సీమాంధ్రలో మొత్తం 175 స్థానాలకు గాను 140 స్థానాలు వస్తాయనీ, అక్కడ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు జగన్ పార్టీ సునామీలో కొట్టుకుపోతాయని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీమాంధ్రలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు భూస్థాపితమేనని ఆయన జోస్యం చెప్పినట్లు తెలుస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ, తెలంగాణలో కూడా జగన్ మోహన్ రెడ్డిని అభిమానించే ప్రజలు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వారి ఓట్లు కూడా జగన్ రాబట్టుకుంటే మరి తెలంగాణలో జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సీట్లు రాబడతారో చూడాలి. విభజన క్లిష్ట సమయంలో జగన్ మోహన్ రెడ్డి బయటకు రావడం రాష్ట్రానికి శుభ పరిణామమే అంటున్నారు ఆయనను అభిమానించే కార్యకర్తలు. చూద్దాం... విభజన అంశంపై జగన్ ప్రభావం ఎంతమేరకు ఉంటుందో...?

వెబ్దునియా పై చదవండి