స్వర్ణయుగం తెస్తా.. మీ బతుకులకు భరోసా ఇస్తా.. జగన్

మంగళవారం, 8 మే 2012 (18:18 IST)
WD
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్విరామంగా ఉప ఎన్నికల ప్రచారాన్ని చేస్తున్నారు. మంగళవారంనాడు ఆయన అనంతపురం జిల్లా రాయదుర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... స్వర్ణయుగం వస్తుందనీ, అప్పుడు అక్కాచెల్లెళ్లు ఎలా బతకాలి అని ఆలోచించే పరిస్థితి లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు.

వృద్ధుల పింఛను రూ. 200 నుంచి రూ. 700కి పెంపు చేస్తామనీ, విద్యార్థులందరికీ రూ. 500 రూపాయలు ఇస్తామన్నారు. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో ఉన్న బోయ, కురుబ కులస్తుల గురించి తనకు తెలుసుననీ, వారి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.

చంద్రబాబు నాయుడు తన కులం, మతం గురించే మాట్లాడుతున్నాడనీ, ప్రజలకు ఏం చేయాలన్నదానిపై మాట్లాడటం లేదని అంటూ... తనది మానవత్వం కులం అని చెప్పుకొచ్చారు.

వెబ్దునియా పై చదవండి