తెలివైన పిల్లలు వెనుకబడటానికి కారణం...?!!

బుధవారం, 22 ఫిబ్రవరి 2012 (10:57 IST)
అన్ని విషయాల్లో ముందుండి, తెలివితేటలకు కొదవలేని పిల్లలు ఇలా చదువులో మాత్రం ఓ అడుగు వెనుక వుండడం చాలామంది తల్లిదండ్రులకు మింగుడు పడదు. ఇందుకు సరైన కారణం తెలియదు. కాబట్టి పరిష్కారాన్ని సులువుగా కనిపెట్టే అవకాశముండదు.

తెలివైన పిల్లలు ఇలా వెనుకబడటానికి గల కారణాన్ని ముందుగా గుర్తించేందుకు తల్లిదండ్రులు, టీచర్లు, పిల్లలు కూడా ప్రయత్నించాలి. ఇలా గ్రేడులు తగ్గిపోతున్నందుకు పిల్లల్ని ఏమాత్రం సాధించకూడదు. సమస్య గురించి ముందుగా పిల్లలతో, టీచర్లతో చర్చించాలి.

ఏదైనా పాఠ్యాంశం మీద ఆసక్తి లేకపోవడం, భయపడడం జరుగుతుందేమో పరిశీలించాలి. మార్కులు తగ్గినందుకు పిల్లల్ని నిందించక, కారణాన్ని బుజ్జగిస్తూ అడిగి తెలుసుకోవాలి. వారు చదివే తీరు, స్కూలుపట్ల చూపించే వైఖరిలను నిశితంగా గమనిస్తుంటే నెమ్మది నెమ్మదిగా విషయం అవగతమవుతుంది.

బాగా తెలివిగల పిల్లలకు కొన్నిసార్లు స్కూలు బోధన, పద్ధతులు రుచించకపోవచ్చు. ఎక్కడ నిరుత్సాహానికి గురవుతున్నారో తెలుసుకుంటే సగం కారణాన్ని గుర్తించినట్లే. సమస్య ఎక్కడుందో తెలిస్తే, ఆ దిశగా పరిష్కార యత్నాలు ప్రారంభించవచ్చు. అవసరం అయితే నిపుణుల కౌన్సిలింగ్ తీసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి