పిల్లలు సెల్‌ఫోన్‌ సంభాషణలు చేస్తున్నారా...?!!

బుధవారం, 11 ఏప్రియల్ 2012 (11:39 IST)
WD
ఆటలు, పాటలు, మాటలు, సందేశాలతో పిల్లలను అమిత వినోదంలో ముంచెత్తుతున్న సెల్‌ఫోన్ వారికో వ్యసనమైందని ప్రపంచ ప్రసిద్ధి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ వినియోగం, పిల్లల సర్వేలో 6-9 ఏళ్లలోపు 22 శాతం, 10-14 ఏళ్లలోపు 60 శాతం, 15-18 ఏళ్లలోపు 84 శాతం మంది పిల్లలు సెల్‌ఫోన్లు వాడుతున్నారని తెలిసింది.

ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న కొత్త ఫోన్లను పరిశీలించండి.. పిల్లలను దృష్టిలో పెట్టుకొని కలర్‌ఫుల్ కిడ్‌-ఫ్రెండ్లీ ఫోన్లను సులువుగా ఉపయోగించగలిగే ఫీచర్స్‌తో సదరు కంపెనీలు లాంచ్ చేస్తున్నారు. రానున్న మూడేళ్లలో 8-12 ఏళ్లలోపు పిల్లలు 54 శాతం సెల్‌ఫోన్లు వినియోగించవచ్చు.

అత్యంత వేగంగా దూసుకువస్తున్న సెల్‌ఫోన్ వాడకం పిల్లలను, టీనేజర్లను మరింత మత్తులోకి లాగనుంది. కాబట్టి ఈ ప్రమాదాన్ని ఊహించి తల్లిదండ్రులు ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఫోన్ వల్ల అనవసరపు మాటలు తప్ప, ఎలాంటి లాభం ఉండదని, సమయం వృథా అని పిల్లలతో వాదించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మారుతున్న కాలాన్ని, పిల్లల మనస్తత్వాన్ని కూడా పెద్దలు అర్థం చేసుకోవాలి. అయితే సెల్‌ఫోన్ ఇచ్చినప్పుడు సమయం వృథా కానివ్వకుండా, రాబోయే సమస్యలు కూడా వివరించి కొన్ని ఆంక్షలతో వారికా సదుపాయాన్ని కల్పించండి.

ఎస్ఎమ్ఎస్‌లు ఎక్కువైపోతున్న ఈ కాలంలో పిల్లలు ఆహారనియమాలు, అనారోగ్య సమస్యలప్పుడు సమయానికి వేసుకోవాల్సిన మందులను గుర్తుచేయడంలాంటి ఉపయుక్తమైన సందేశాలను ప్రోత్సహించాలి.

అయితే మానసిక ఆరోగ్యం చెడగొట్టడం, ఇతరుల రౌడీయిజం, కన్ను ఒత్తిడికి లోనవడం, బ్రెయిన్ ట్యూమర్లు, నిద్రలేమి.. వంటి ఎన్నో సమస్యలకు సెల్‌ఫోన్ కారణం కావచ్చు. వీటిని గుర్తుపెట్టుకొని తల్లిదండ్రులు పిల్లలకు సెల్‌ఫోన్ ఇచ్చే ముందు కొన్ని ఆంక్షలు విధించడం అవసరం.

వెబ్దునియా పై చదవండి