పిల్లల్లో వేలు చీకే అలవాటు చాలా డేంజర్.. తప్పనిసరిగా మాన్పించాల్సిందే!

సోమవారం, 16 మార్చి 2015 (17:12 IST)
పిల్లల్లో వేలు చీకే అలవాటు చాలా డేంజర్.. తప్పనిసరిగా మాన్పించేయండి అంటున్నారు చైల్డ్ కేర్ నిపుణులు. ఆకలి, నొప్పి వేరేదేనీ రుగ్మతలను పిల్లలు చెప్పలేక వేలుచీకేందుకు అలవాటైపోతారు. ఈ అలవాటును మాన్పించడానికి చేతివేలికి వేపనూనె రాయడం వంటివి చేయాలి. లేకుంటే చైల్డ్ కేర్ నిపుణులను సంప్రదించాలి. 
 
సాధారణంగా పిల్లలు పుట్టిన 45 రోజుల నుంచి 2 నెలలలోపు వేలు చీకే అలవాటును మొదలెడతారు. ఆరు నెలల వరకు ఈ అలవాటుంటే తప్పులేదు. అయితే ఇందుకు వేపనూనె వంటివి కాకుండా పిల్లలలో ప్రేమతో మాట్లాడటం వంటివి చేయాలి. వేలు చీకే అలవాటుతో ఏర్పడే సమస్యల గురించి చెప్పాలి. తల్లిదండ్రులు తమతో లేరనే బాధ, భయంతో పిల్లల్లో వేలు చీకే అలవాటు వచ్చేస్తుంది. పారెంట్స్ పక్కన లేకపోవడం, క్రీచ్‌ల్లో పిల్లలుండటం వంటి కారణాలచేత ఏర్పడే బోర్ డమ్‌తోనే పిల్లల్లో వేలు చీకే అలవాటు వచ్చేస్తుంది. 
 
* ఈ అలవాటుండే పిల్లలకు బొమ్మలతో ఆడుకోనివ్వాలి
* తల్లిదండ్రులు ఎక్కువ సమయం పిల్లలతో గడపాలి. 
* పిల్లల్లో వేలు చీకే అలవాటును మాన్పించాలంటే.. పిల్లలతో ఎక్కువ సేపు మాట్లాడాలి. 
* పిల్లలపై తల్లిదండ్రులు కోపాన్ని, అసహనాన్న ప్రదర్శించకూడదు. 
* పిల్లల్నీ టీవీలకు అతుక్కుపోనివ్వకూడదు. 
 
*  4-5 ఏళ్లైనా పిల్లల్లో ఈ అలవాటు మాన్పించడం కుదరకపోతే.. వైద్యులను సంప్రదించాల్సిందే. 
*  పిల్లల్లో వేలు చీకే అలవాటుంటే ముందు వరుస దంతాలు పెరగవు. వాటి షేప్ సరిగ్గా ఉండవు. చేతివేళ్ల ద్వారా క్రిములో నోట్లోకి చేరి అంటువ్యాధులు, జ్వరం, విరేచనాలు ఏర్పడే ప్రమాదముందని చైల్డ్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి