ఒక్కోసారి పిల్లలు అతిగా ప్రవర్తించడానికి మీరు వ్యవహరించే తీరూ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. అదెలా అంటారా..? చిన్నపిల్లాడనో లేక ఒక్కతే ఆడపిల్లనో ఎక్కువ గారాబం చేస్తుంటారు. మీరు శ్రద్ధ చూపించేవారికి ఇది అలుసుగా, చిన్నారులు తమపై నిర్లక్ష్యం చూపుతున్నారని భావించే ప్రమాదం ఉంది. తప్పెవరిదైతే వారినే మందలించాలి. అలానే క్షమాపణ అడిగే అవకాశాన్ని ఇవ్వాలి. ముఖ్యంగా వారి తప్పును వారు సరిదిద్దుకునే అవకాశం కల్పించాలి.
ఈ కొట్లాటాల వలన పిల్లలకు తగలకూడని చోట దెబ్బలు తగిలితే సమస్యలు మరింత ఎక్కువైపోతాయి. ఇవి వారి మనుసులపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అందువలన ఎవరు గొడవపడినా తప్పెవరిది అనే విషయం పక్కనపెడితే అలా చేయడం తప్పన్న విషయం స్పష్టంగా వారికి చెప్పాలి. ముఖ్యంగా ఇద్దరి మధ్య ఏవైనా సమస్యలు ఉంటే ఆ విషయం మీ దృష్టికి తీసుకురమ్మని చెప్పాలి.