పిల్లలకు వారంలో రెండుసార్లు చేపలు పెట్టాలి. ఇవి శరీరానికి తగిన పరిమాణంలో ఫ్యాటీ ఆమ్లాలను అందజేస్తాయి. అందుకే వారంలో కనీసం రెండుసార్లు తినేలా చూడాలి. శాకాహారులయితే.. వాల్‌నట్లు, పిస్తా.. వంటివి తినేలా చూడాలి. సీఫుడ్స్ తీసుకోవడం ద్వారా పిల్లలకు అవసరమైన క్యాల్షియం అందుతుంది. ఎముకలు బలపడతాయి. చర్మం సున్నితంగా ఉంటుంది. చేపల్లోని పోషకాలు కంటికి, చర్మానికి, మెదడుకు మేలు చేస్తాయి. మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. చేపలు పిల్లల్లో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు.
అలాగే బాదం పిల్లల మెదడును మెరుగ్గా పనిచేయిస్తాయి. వీటిలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడులోని కణాలకు మేలుచేస్తాయి. అలాగే బాదంలో ఉండే జింక్ యాంటీఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను నిరోధిస్తుంది. లేదంటే అవి మెదడు కణాలపై ప్రభావం చూపిస్తాయి. ఇక, బాదంలో ఉండే విటమిన్-బి6, విటమిన్-ఇ పోషకాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ ఆమ్లాలు మెదడును చురుగ్గా ఉంచేలా చేస్తాయి.