గణితం సృజనాత్మకత, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. ఇంకా, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్‌తో సహా వివిధ విద్యా విషయాలలో విజయం సాధించడానికి గణితంలో నైపుణ్యం ముఖ్యం. గణిత భావనలపై పట్టు సాధించడం ద్వారా పిల్లలు ఆత్మవిశ్వాసం, సామర్థ్యాలను పొందుతారు. వారు భవిష్యత్ విద్యా, కెరీర్ ప్రయత్నాలకు బలమైన పునాది వేస్తారు.
అలాగే వంట, షాపింగ్ లేదా బడ్జెట్ వంటి రోజువారీ కార్యకలాపాల్లో పిల్లలను పాల్గొనడం ద్వారా నిజ జీవిత గణితాలను తెలుసుకుంటారు. ప్రాక్టికల్‌గా షాపింగ్ కోసం వెచ్చించే మొత్తాన్ని కూడమని చెప్పడం, లెక్కించమని చెప్పడం ద్వారా లెక్కలు వారికి సులభంగా అర్థం అవుతాయి.
పదార్థాల కొలతలను లెక్కించమని, ధరలను సరిపోల్చమని లేదా చెల్లింపులను నిర్వహించమని వారిని అడగండి.. భవనం, తోటపని లేదా క్రాఫ్ట్ ప్రాజెక్ట్‌ల ద్వారా గణిత భావనలను అన్వేషించేలా చేయడం ద్వారా పిల్లల్లో మ్యాథ్స్ ఈజీగా వచ్చేస్తుంది.