వన్ మినిట్‌లో ఉందట మాస్టారూ..!!

శుక్రవారం, 20 మార్చి 2009 (11:06 IST)
"ఒరేయ్ చింటూ... నేను వెంటనే ఢిల్లీకి వెళ్ళాలి.. రైలు ఎన్ని గంటలకు ఉందో ఫోన్ చేసి కనుక్కో..?" చెప్పాడు మాస్టారు

"సరేనండీ..." అన్నాడు చింటూ

వెంటనే రైల్వేస్టేషన్‌కు ఫోన్ చేసిన చింటూ.. "రైలు ఎన్నింటికి ఉందో చెప్తారా అండీ...?" అని అడిగాడు

"వన్ మినిట్ ప్లీజ్" అంది రైల్వే క్లర్కు

వెంటనే ఫోన్ పెట్టేసిన చింటూ... "రైలు వన్ మినిట్లో ఉందట మాస్టారూ...!" అని చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి