తాత్పర్యం : సముద్రపు అలల్లో బుడగ ఏ రకంగా పుట్టుచూ, గిట్టుచూ ఉంటుందో... అదే విధంగా భోగభాగ్యాలనేవి ఒకదాని తరువాత ఒకటి వచ్చిపోతుంటాయి. అంతేగానీ... వాటికోసం బాధపడాల్సిన అవసరం లేదని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి. అలాగే కష్టసుఖాలనేవి కూడా ఒకదాని తరువాత ఒకటి వచ్చిపోతుంటాయి, ఏవీ శాశ్వతం కాదని మనం అర్థం చేసుకోవాలి.