కలిమిగల్గ నేమి కరుణ లేకుండెనా...!

కలిమిగల్గ నేమి కరుణ లేకుండెనా
కలిమి యేల నిలుచు కర్ములకును
తేనెగూర్చి ఈగ తెరువున బోవదా?
విశ్వదాభిరామ వినుర వేమా...!

తాత్పర్యం :
ఎంత ధనం సంపాదించినా ఉదార గుణం లేకపోతే అది వ్యర్థం. అటువంటి సంపద పూర్వజన్మ దుష్కృతం వల్ల కరిగిపోతుంది కూడా... తేనెటీగను చూడండి. అది పువ్వు పువ్వుపై వాలి మకరందాన్ని అంటే తేనెను సేకరించి, తేనె పెరలో పెట్టి ఇతరులకు వదిలేసి తన దారిన తాను వెళ్లిపోతుంది. కాబట్టి, డబ్బు సంపాదించినప్పటికీ ఉదార గుణం లేనివారు తేనెటీగను చూసి నేర్చుకోవాలని ఈ పద్యంలో చెప్పాడు వేమన మహాకవి.

వెబ్దునియా పై చదవండి