Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

దేవీ

శనివారం, 24 మే 2025 (13:35 IST)
Bellamkonda Sai Srinivas
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల అందించిన గ్రిప్పింగ్ స్కోర్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఈనెల 30న సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
 
- భైరవం కథను తమిళంలో సూరి నటించిన గరుడన్ కు రీమేక్. దర్శకుడు విజయ్ కనకమేడల చాలా మార్పులు చేశారు. నా పాత్రలోనూ కొంత ఛేంజ్ చేశారు. ఇంకా ఇద్దరు కేరెక్టర్లు చేయాలనుకున్నప్పుడు మొదట గుర్తుకువచ్చింది. మంచు మనోజ్. అంతకుముందు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాలో ఆయన విలన్ గా నటిస్తున్నాడు. ఆ గెటప్ చూసి వెంటనే కరెక్ట్ పర్సన్ అని డిసైడ్ చేశాం. ఆ తర్వాత నారా రోహిత్ అనుకున్నాం. ఇద్దరూ ఒకే ఏజ్ లో వుండాలని తీసుకున్నాం.
 
- మనోజ్ పాత్ర చాలా పవర్ ఫుల్. క్లయిమాక్స్ ఫైట్ మా ఇద్దరిపై వుంటుంది. హారిబుల్ గా వుంటుంది. చాలా కష్టపడ్డాం. యాక్షన్ సీన్స్ చేసేటప్పుడు ఏమీ అనిపించలేదు. కానీ తర్వాత రోజు మాత్రం ఒళ్ళు హూనం అయిపోయింది. నొప్పులతో బాడీ సెట్ చేయడానికి టైం పట్టేది.
 
- మనోజ్ వుండడంవల్ల చాలా నిర్మాత చాలా కేర్ తీసుకున్నారు. టీమ్ కు ఏది కావాలో అది నిర్మాత రాధామోహన్ గారు అందించారు. ఆయన సపోర్ట్ లేకపోతే సినిమా  పూర్తయ్యేదికాదు.
 
- ఇక షూటింగ్ లో వున్నప్పుడు మోహన్ బాబు ఇంటినుంచి మాకు భోజనం వచ్చేంది. మనోజ్ అంత కేర్ తీసుకున్నారు. ఇందుకు మోహన్ బాబుగారికి థ్యాంక్స్ చెప్పాలి.
 
- మా సినిమా విడుదలవుతున్న టైంలో థియేటర్ల సమస్య తలెత్తింది. అది కూడా మనోజ్ వున్నాడనే కొంత గందరగోళం చేశారు. అయినా థియేటర్ల ఇష్యూ పెద్దలు చూసుకుంటారు. బంద్ అనేది జరగ్గపోవచ్చు.
 
- నా సినిమాలు హిట్ అయినా ప్లాప్ అయినా ఒకేలా వుంటాను. హిట్ అయితే ఏడుస్తాను. హిట్ అయిన ఆనందంలోకల్ళ వెంట నీళ్ళు వస్తాయి. అదే ఫ్లాప్ అయినా కూడా మరింత ఏడుపువస్తుంది. ఏది ఏమైనా హిట్, ఫ్లాప్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే పాఠం నేర్చుకున్నాను.
 
- నాకు దైవభక్తి ఎక్కువ. అందుకే అమ్మవారి బొమ్మను నేను వేసుకునే షర్ట్ పై వుంచుకున్నాను. చాలా జాగ్రత్తగా  వుంటున్నాను. అంతా అమ్మ దయతో సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు