గోరంత దీపం కొండంత వెలుగు...!!

గోరంత దీపము కొండంత వెలుగు
మాఇంటి పాపాయి మాకంటి వెలుగు

వెచ్చాని సూరీడు పగలంతా వెలుగు
చల్లని చంద్రుడు రాత్రంతా వెలుగు

ముత్యమంత పసుపు ముఖమంత వెలుగు
ముత్తైదు కుంకుమ బ్రతుకంత వెలుగు

గురువుమాట వింటే గుణమంత వెలుగు
మంచి చదువులు నీకు భవిష్యత్తు వెలుగు

వెబ్దునియా పై చదవండి