చిట్టి నా కన్నోడ శ్రీకృష్ణావతారం

మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం

వరసైన బావల్లు వరాహావతారం
నట్టింట నాయత్త నరసింహావతారం

వాసిగల బొట్టెల్లు వామనావతారం
పరమగురుదేవ పరశురామావతారం

బంటైన బంధువులు బలభద్రావతారం
కలివిడితో మాయన్న కలికావతారం

బుద్ధితో మా చిట్టి బుద్ధావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తండ్రి
చిట్టి నా కన్నోడ శ్రీ కృష్ణావతారం

వెబ్దునియా పై చదవండి