చిన్నారి పాప అల్లారు ముద్దు

చిట్టి మా అమ్మాయి శ్రీ ముఖము చూసి
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెరచు
పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటే
పనసపండని జనులు పరుగులెత్తేరు

దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే
దోసపండని జనులు దోసిలొగ్గేరు
నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు
నిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోట

పగడాలు రత్నాలు పారిజాతాలు
పడలి మా అమ్మాయి పనిచేయుచోట
చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు
అందరికీ మా అమ్మి అల్లారు ముద్దు

వెబ్దునియా పై చదవండి