జోజోజోజో సరసిజ నయనా...!!

జోజోజోజో సరసిజ నయనా హరీశ్రీసదనా
ఒడి ఉయ్యాల పవళింపవయా
పాల్కడలి లహరిపై తూగవయా
జిలిబిలి చేతలు చిరునవ్వు పూతలు
మాని హాయిగా నిదురింపవయా "జోజో"

ఎటుల నిన్ను లాలింతునయా
ఈ సకల జగము పాలింతువయా
నను మరపించిన నను మురిపించిన
నల్లనయ్య నిదురింపవయా "జోజో"

వెబ్దునియా పై చదవండి