తాత్పర్యం : ఎలాంటి పని అయినా ఆలస్యంగా చేయరాదు. అలాగని తొందరపడి చేసినట్లయితే దుష్ఫలితాలు సంభవిస్తాయి. పసరుకాయను కోసుకుని వచ్చి, వెంటనే పండిపోవాలని అనుకుంటే పండదు కదా అని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి... ఏ పని, ఏ సమయానికి జరగాలో ఆ సమయానికే జరగాలి. ఆలస్యం అమృతం విషం కావచ్చు. మరీ ఆలస్యమైతే విషమవుతుంది. అలాగని అవసరానికి ముందుగానే తొందరపడితే విరుద్ధ ఫలితాలు వస్తాయన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని ఈ పద్యంలో చెప్పాడు వేమన.