తన కోపము తన శత్రువు తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ..!
తాత్పర్యం : తన యొక్క కోపము శత్రువులాగా బాధను, తన నెమ్మదితనము తనకు రక్షకునివలె రక్షణను, తన కరుణ తనకు చుట్టం లాంటి ఆదరమును, తన సంతోషము తనకు స్వర్గలాంటి సుఖాన్ని, తన దుఃఖము తనకు నరకం లాంటి వేదనను కలిగించునని భావం.