కోడిగుడ్డు... చిన్నోడి పాట్లు..!!

గురువారం, 26 మార్చి 2009 (12:31 IST)
వానా వచ్చే.. వంకలు పారే
కోడి వచ్చే.. గుడ్డు పెట్టే
తాతా వచ్చే.. తొంగీ చూసే

అవ్వ వచ్చే.. గుడ్డు తీసే
అమ్మా వచ్చే.. అట్టు చేసే
అన్నా వచ్చే... గుటుక్కున మింగె

దీంతో కోపం వచ్చే... చిన్నోడికి
నాన్న వచ్చే.. డబ్బులు ఇచ్చే
సైకిల్ వచ్చే.. రాళ్లమీద తిప్పే

కాలూ జారే... డాక్టర్ వచ్చే
మందులు ఇచ్చే... మంచం ఎక్కే
మందులు మింగే.. స్కూలుకు వెళ్లే...!!!

వెబ్దునియా పై చదవండి