చిలకమ్మ.. చిన్నారి చెల్లి ఒడిలో..!

ఊరు ఊరు మాఊరు
ఊరి పక్కనే మాతోట
తోటలోన జామచెట్టు
చెట్టు మీద చిలకమ్మ
చిలక పేరు సీతమ్మ
సీత జడలో చేమంతి

చిలకమ్మ రివ్వుమని
ఎగురుకుంటూ ఇంటికొచ్చి
అమ్మకేమో పువ్వు ఇచ్చి
నాన్నకేమో ముద్దు ఇచ్చి
నాకేమో జామపండు ఇచ్చి
చెల్లి ఒడిలో చక్కగ చేరింది...!

వెబ్దునియా పై చదవండి