నెపమెన్నక జేయువాడే..!

మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (10:20 IST)
FileFILE
ఉపకారికి నుపకారము
విపరీతముగాదుసేయ వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడె నేర్పరి సుమతీ!

తాత్పర్యం :
ఉపకారం చేసిన వారికి తిరిగి ఉపకారం చేయడం గొప్ప విషయం కాదు. అదే కీడు చేసినవారి తప్పులు లెక్కపెట్టకుండా ఉపకారం చేయడమే తెలివైన పని అని ఈ పద్యంలో సుమతీ శతకకారుడు చెప్పాడు.

వెబ్దునియా పై చదవండి