బుర్రుపిట్ట బుర్రుపిట్ట తుర్రుమన్నది పడమటింటి కాపురం చేయనన్నది అత్త తెచ్చిన కొత్తచీర కట్టనన్నది మామ తెచ్చిన మల్లెపూలు ముడవనన్నది మగనిచేత మొట్టికాయ తింటనన్నది
*** *** *** *** ***
ఉడతా ఉడతా వెంటనే రా రా చక్కని ఉడతా వెంటనే రా రా జామ చెట్టు ఎక్కి రా రా మంచి పండు లాక్కొని రా రా సగం పండు నీకూ.. సగం పండు నాకూ నీవు నేను కలిసి.. కొరికి కొరికి తిందాం...!!