శాంతమే రక్ష

సోమవారం, 15 సెప్టెంబరు 2008 (12:08 IST)
FileFILE
తన కోపము తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష దయ చుట్టం‌బౌ
తన సంతోషమె స్వర్గము
తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతీ..!

తాత్పర్యం :
తన యొక్క కోపము శత్రువులాగా బాధను, తన నెమ్మదితనము తనకు రక్షకునివలె రక్షణను, తన కరుణ తనకు చుట్టం లాంటి ఆదరమును, తన సంతోషము తనకు స్వర్గలాంటి సుఖాన్ని, తన దుఃఖము తనకు నరకం లాంటి వేదనను కలిగించునని భావం.

వెబ్దునియా పై చదవండి