సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ..!!

సన్నుత కార్యదక్షు డొకచాయ నిజప్రభ యప్రకాశమై
యున్నపుడైన లోకులకు నొండొక మేలొనరించు సత్వసం
పన్నుడు భీము డా ద్విజుల ప్రాణము కావడె ఏకచక్రమం
దెన్నికగా బకాసురుని నేపున రూపుడగించి భాస్కరా....!!

తాత్పర్యం :
భీముడు బ్రాహ్మణ వేషంలో అజ్ఞాతంగా గడపాల్సి వచ్చిన సమయంలో కూడా ఏకచక్రపురంలోని బ్రాహ్మణ కుటుంబాన్ని బకాసురుని బారినుంచి రక్షించగలిగాడు. కాబట్టి... కార్యదక్షుడైనవాడు ఏ కారణం చేతనయినా తన గొప్పతనమును మరుగు పరచుకోవాల్సి వచ్చినప్పటికీ... ఇతరులకు తన చేతనైనంత మేలు ఏదయినా సరే చేయగలడని భావం.

వెబ్దునియా పై చదవండి