బాలలకు బొమ్మల కథలంటే ఎంతో ఇష్టం. అందులోనూ రామాయణ, మహాభారత కథలను బొమ్మలతో చిత్రీకరించి పిల్లలకు అందిస్తే వారి ఆనందానికి హద్దే ఉండదు. ఈ ఆనందాన్ని బాలలకు సొంతం చేసేందుకు వెబ్‌దునియా తెలుగు అమరచిత్ర కథలు శీర్షిక పేరిట బొమ్మల కథలను అందిస్తోంది.
ఇందులో రామాయణ, మహాభారత కథలతోపాటు తెనాలిరామలింగడు వంటి హాస్య కథలు సైతం అందించనున్నాం. వారానికోసారి ఆనంద సాగరంలో ముంచేందుకు మీ ముందుకు రానున్నాయి ఈ అమరచిత్ర కథలు.
బాలలూ... మరి ఎందుకాలస్యం. పాఠశాలలకు శెలవులు కూడా ఇచ్చేశారు. కనుక మీ జ్ఞానానికి మరింత పదునుపెట్టే అమరచిత్ర కథలను చదివండి. అమ్మా,నాన్న,బామ్మ, తాతయ్యలకు కథలు కథలుగా చెప్పండి.