వై.ఎస్.కు పిండ ప్రదానం... జగన్ మోహన్ రెడ్డికి కంచి స్వామి ఆశీర్వాదం(ఫోటోలు)
గురువారం, 18 ఆగస్టు 2016 (15:32 IST)
విజయవాడ: ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి కృష్ణా నదిలో పుష్కర స్నానం ఆచరించారు. విజయవాడలోని పున్నమి వి.ఐ.పి పుష్కర ఘాట్లో సంప్రదాయబద్ధంగా ఆయన కృష్ణలో మూడుసార్లు మునిగారు. అనంతరం కృష్ణ ఘాట్ ఒడ్డున తన తండ్రి వై.ఎస్.కు పిండ ప్రదానం చేశారు.
జగన్ వెంట గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు ఇతర వైసీపీ నేతలున్నారు. అనంతరం జగన్ లబ్బీపేట లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేంచేసిన కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందారు.