నిద్రలేచిన వెంటనే సుజాత తన భర్త సుందరంతో ఇలా అంది. సుజాత : వచ్చే మన పెళ్ళిరోజు మీరు నాకు రవ్వల నక్లెస్ ఇచ్చినట్లు రాత్రి కల వచ్చిందండి. ఎందుకనంటారు? సుందరం : సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చాక చెప్తాను.
సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చిన సుందరం చేతిలో ఒక ప్యాకెట్‌ను చూసి రవ్వల నక్లెస్ అనుకుని మురిసిపోయింది సుజాత. ప్యాకెట్ సుజాత చేతికిచ్చి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి దొడ్లోకి వెళ్లాడు సుందరం. గబగబా ప్యాకెట్‌ను తెరిచి చూసిన సుజాత కళ్ళు తేలేసింది. ఎందుకంటే... ప్యాకెట్‌లో "స్వప్నాల వెనుక అర్ధాలు' అనే పుస్తకం ఉంది మరి...