2025 హీరోయిన్ పూజా హెగ్డేకు బాగా కలిసొచ్చేలా వుంది. ఈ ఏడాది పూజా వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇప్పటికే రెట్రో సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇది కాకుండా హిందీలో ఆమె నటించిన దేవా సినిమా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దేవా గర్ల్ ఫ్రెండ్ దియాగా పూజా కనిపించింది.