త్వరలోనే తెలుస్తుందిలే... ?

బుధవారం, 23 జులై 2008 (14:55 IST)
నిన్న వాలంటైన్స్ డే నాడు రంజిత్ నన్ను ప్రేమిస్తున్నట్టు చెప్పాడమ్మా అంటూ వయ్యారాలు పోతూ తల్లికి చెప్పింది రమ్య.

రంజిత్ చాలా మంచివాడమ్మా నువ్వు అతని ప్రేమను ఒప్పుకుని పెళ్లి చేసుకో అంటూ రమ్యకు సలహా ఇచ్చింది తల్లి.

కానీ రంజిత్ బొత్తిగా నాస్తికుడమ్మా... స్వర్గం, నరకం ఏదీ లేదని వాదిస్తుంటాడు. అలాంటివాడిని ఎలా పెళ్లి చేసుకోను అంటూ తల్లిని ప్రశ్నించింది రమ్య.

నిన్ను పెళ్లి చేసుకున్నాక స్వర్గం, నరకం ఉన్నాయని మెల్లగా అతనికే తెలుస్తుందిలేమ్మా అంటూ రమ్యకు చెప్పింది తల్లి.

వెబ్దునియా పై చదవండి