నేను కృతి సనన్ కలిసిన ఫోటో కనబడితే మా ఇద్దరికీ లింక్ వున్నట్లా?: కిరణ్ రాయల్

ఐవీఆర్

బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (18:42 IST)
తనపై సాక్షి పత్రిక పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నదంటూ కిరణ్ రాయల్ మండిపడ్డారు. తిరుపతి ప్రెస్ క్లబ్బులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ''ఇదిగో ఇక్కడ చూడండి. మూడు ఫోటోలు వున్నాయి. ఈ మూడు ఫోటోల్లో నేను వున్నాను. కానీ నా పక్కన వేర్వేరు వ్యక్తులు వున్నారు. మొదటి ఫోటోలో నాతోపాటు కృతి సనన్ వుంది. రెండో ఫోటోలో నేను వంటరిగా వున్నాను. మూడో ఫోటోలో నాతో పాటు లక్ష్మీ రెడ్డి వున్నారు. ఈ మూడు ఫోటోల్లో వంటరిగా నేను వున్నది నిజమైనది. మిగిలిన రెండూ మార్పింగ్ చేసిన ఫోటోలు.
 
నా పక్కన కృతి సనన్ వుంటే నాకు ఆమెకి లింక్ వున్నట్లా? జగన్ మోహన్ రెడ్డితో కొంతమంది సినీ తారలు ఫోటోలు దిగారట. వారితో ఆయనకు సంబంధం వున్నట్లా? ఫోటోల్లో ఓ వ్యక్తి మన పక్కన వుంటే లింకులు పెట్టేస్తారా? సాక్షి పత్రిక గత 3 రోజులుగా పనిగట్టుకుని నాపైనే ఫోకస్ పెట్టింది. అసలు పత్రిక నాకోసమే వార్తలు రాయడానికి వుందా అనిపిస్తుంది.
 
నా గురించి ఫోటోలు వస్తే అవి నిజమైనవో కావో చెక్ చేయరా? అందుకే నేను కోర్టులో పరువు నష్టం దావా కేసు వేస్తున్నా. ఇన్నాళ్లు మా నాయకుడు ఆగమంటే ఆగుతూ వచ్చాను. ఇక ఆగను. నన్ను బజారుకీడ్చాలన్నవారి భరతం పడతా'' అంటూ చెప్పారు కిరణ్ రాయల్.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు