రోజూ సెలూన్‌కి వస్తున్నాడు రాజా. జుట్టు కత్తిరించడానికి ఎంతసేపు పడుతుందని ఆ యువకుడు అడిగి వెళ్ళిపోతున్నాడు. రంగారావు సెలూన్ బాగా రద్దీగా ఉండటం వల్ల ఆ యువకుడిని రెండుమూడు గంటల తర్వాత రమ్మని చెప్పాడు. కానీ రాజా రాలేదు. ఐతే ఒకరోజు మళ్ళీ ఆ యువకుడు వచ్చాడు. కటింగ్ చేయించుకునేందుకు ఎంత సమయం పడుతుందని అడిగాడు. రంగారావు అతన్ని రెండు గంటల తరువాత రమ్మన్నాడు.
ప్రతిసారీ టైం అడిగి వెళ్ళిపోవడమేకాని తిరిగి ఆ యువకుడు సెలూన్‌కి రాకపోవడంతో రంగారావు తన పనివాడిని పిలిచి, ప్రతిసారీ టైం అడిగి వెళ్ళిపోతున్న ఆ యువకుడు ఎక్కడికి వెళూతున్నాడు? ఏం చేస్తున్నాడో తెలుసుకురమ్మని పంపించాడు.
కొద్దిసేపటి తరువాత పనివాడు పళ్లికిలిస్తూ రావడం చూసి అడిగాడు రంగారావు. 'చెప్పు, ఇంతకీ వాడు ఎక్కడికెళ్ళాడు?" అని గద్దాయించాడు. "గురూ... వాడు ఇక్కడి నుండి సరాసరి మీ ఇంటికే వెళ్ళాడు "అన్నాడా పనివాడు. ఇంకేముంది రంగారావు తన ఇంటినే సెలూన్‌గా మార్చుకున్నాడు పాపం.