నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

దేవీ

శుక్రవారం, 4 జులై 2025 (14:52 IST)
Abid Bhushan, Rohit Sahni, Rhea Kapoor, Meghana Rajput
నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, బిగ్ బాస్ ఫేమ్ రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్ చిత్రం రూపొందుతోంది. ఉషా, శివాని నిర్మించిన ఈ చిత్రానికి  మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహించారు. రియా కపూర్, మేఘనా రాజ్‌పుత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన రెండు పాటలతో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను ఘనంగా లాంచ్ చేసింది మూవీ టీమ్.
 
ఈ సందర్భంగా డైరెక్టర్ మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘’సస్పెన్స్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ,తాజాగా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ తో సినిమా సక్సెస్ పై మరింత కాన్ఫిడెన్స్ పెరిగిందని’’ చెప్పుకొచ్చారు.
ఇక నిర్మాతలు ఉషా మరియు శివాని మాట్లాడుతూ ‘’సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించామని, టీజర్ అందరికీ నచ్చడం సంతోషమని, ఫ్యూచర్లో మరిన్ని మంచి సినిమాలతో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తామని’’ తెలిపారు.
 
ఇక సినిమాలో జంటగా నటించిన అబిద్ భూషణ్, రోహిత్ సహాని మాట్లాడుతూ ‘’ఇంతమంచి అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ ,ప్రొడ్యూసర్స్ కి చాలా థాంక్స్ అని ,ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలు మంచి టాక్ తెచ్చుకోవడంతో పాటు రిలీజ్ అయిన టీజర్ కి కూడా మంచి అప్లాజ్ రావడం ఆనందంగా ఉందని’’ తమ సంతోషాన్ని పంచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు