శ్యామలకు సరిపోవు

బుధవారం, 5 నవంబరు 2008 (16:38 IST)
శీను, రాధ ప్రేమికులు. రాధ జబ్బుపడి చనిపోయే స్థితిలో ఉంటుంది...

హాస్పిటల్ బెడ్‌పైన చావు బ్రతుకుల్లో ఆమె దగ్గరే ఉంటాడు శీను...

"శీనూ... నేనింక ఎక్కువసేపు బ్రతకను... నే చనిపోగానే మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో..!" చెప్పింది రాధ

"ఏంటా మాటలు... నువ్వు లేకుండా నేనెలా బ్రతికేది" ఏడుస్తూ బదులిచ్చాడు శీను

"నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో గానీ... నా చీరలు, జాకెట్లు మాత్రం ఎవరికీ ఇవ్వద్దు ప్లీజ్‌..!" దీనంగా అర్థించిందామె

"అలాగే రాధా..! నిజానికి నీ బట్టలు ఆ శ్యామలకు సరిపోవు.. అది నీ కన్నా ఎత్తు, లావుగా ఉంటుందిలే..!" ఓదార్చుతూ చెప్పాడు శీను.

వెబ్దునియా పై చదవండి