ఇంతలో ఇద్దరూ ఎవరికెంత ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే, తదేకంగా ఒకర్నొకరు చూస్తూ ఉండాలనీ, అలా చూడకుండా పక్కదారి పట్టినట్టినవారికి అంతగా ప్రేమలేదని చిన్న పందెం పెట్టుకున్నారు.
ఇద్దరూ అలా తదేకంగా చూస్తూ ఉన్నారు.. ఇంతలో రాధ చేతివైపు చూసేందుకు కళ్లు తిప్పగా.. కళ్లతోనే వారించాడు గోపి..
రాధ అలా చాలాసార్లు ప్రయత్నించినా గోపీ ఒప్పుకోలేదు... చివరకు ఒళ్లుమండిన రాధ...
"అబ్బా ఉండవయ్యా మొగుడా... ఇందాకటినుంచీ.. చేతిపైన ఏదో పాకుతూనే ఉంది.. ఏదో, ఏంటో అని టెన్షన్‌తో చస్తుంటే.. నిన్నే చూస్తూ కూర్చోవాలా...?!" కయ్‌మంటూ ఇంతెత్తున లేచింది.