ఆమెకు స్పీడ్ తక్కువ

శనివారం, 26 జులై 2008 (16:55 IST)
ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు
అదేంటిరా గంట నుంచి ఆ కాగితం మీద రాస్తూనే ఉన్నావు. ఇంతకీ అందులో ఏం రాస్తున్నావు రా అన్నాడు గోపీతో అతని స్నేహితుడు.

నా గర్ల్‌ఫ్రెండ్‌కు లవ్ లెటర్ రాస్తున్నాను రా అంటూ చెప్పాడు గోపీ.

ఎంత లవ్ లెటర్ అయితే మాత్రం అంతసేపు రాయాలా అంటూ ఆశ్చర్యంగా అడిగాడు గోపీ స్నేహితుడు.

ఏం చేయనురా నా గర్ల్‌ఫ్రెండ్‌కు తెలుగు వేగంగా చదవడం రాదు. అందుకే బాగా నెమ్మదిగా లెటర్ రాస్తున్నా అంటూ సీరియస్‌గా చెప్పాడు గోపీ.

వెబ్దునియా పై చదవండి