ఎచట సుఖముందో ఎచట సుధగలదో అచటె మనముందామా

గురువారం, 26 మే 2011 (17:57 IST)
WD

ప్రేమలో పడిన ఏ జంటైనా తమదైన లోకంలో విహరిస్తూ ప్రేమగీతాలను ఆలపించడం సహజమే. అయితే తమదైన సొంత ప్రేమాలాపనలతోపాటు తమకు మధురాతిమధురంగా తోచే గీతాలను కూడా ఎంతో ప్రీతిపాత్రంగా వింటుంటారు. అటువంటివాటిలో ఆరుద్ర రాసిన వీరాభిమన్యు చిత్రంలోని ఓ ప్రేమగీతం... నవలోకంలో విహరింప చేస్తుంది.

అదిగో నవలోకం వెలసే మనకోసం

నీలి నీలి మేఘాల లీనమై

ప్రియా నీవు నేను తొలిప్రేమకు ప్రాణమై

దూర దూర తీరాలకు సాగుదాం

సాగి దోర వలపు సీమలో ఆగుదాం

ఎచట సుఖముందో ఎచట సుధగలదో

అచటె మనముందామా

పారిజాత సుమ దళాల పానుపు

మనకు పరచినాడు చెరకు వింటి వేలుపు

ఫలించె కోటి మురిపాలు ముద్దులు

మన ప్రణయానికి లేవు సుమా హద్దులు

ఎచట హృదయాలు ఎపుడూ విడిపోవో

అచటె మనముందామా...

వెబ్దునియా పై చదవండి