నిత్యనూతనం... నీ పరిచయం

మంగళవారం, 4 డిశెంబరు 2007 (17:24 IST)
ప్రకృతి అందాలకే అందని సౌందర్యానివి నీవు
అంతటా నీవై నిండి ఉన్నావు
తలపుల మాటున నీ ప్రతిరూపం
తట్టి లేపుతుంది ప్రతి క్షణం

ఆనందపు హరివిల్లు...
నీ మధురమైన సాంగత్యం
ముత్యాల సిరి జల్లు...
నీ తీయని మాటలు

నిత్యనూతనం.... నీ పరిచయం
అజరామరంగా నిలవాలి నీతో ప్రతి క్షణం

-యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావ

వెబ్దునియా పై చదవండి